కాకినాడ లీగల్: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం బూటకపు జీవో తీసుకొచ్చి ఆ వర్గాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పితాని శ్రీనివాసరావు విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాకినాడ గాంధీనగర్‌లో ఆ వర్గం న్యాయవాదులు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అధిక శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నమ్మకం కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఇచ్చిన జీవో న్యాయస్థానంలో నిలబడదని తెలిసినప్పటికీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు న్యాయం చేయకుండా, అధిక రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చూపించడం మభ్యపెట్టడమేనని అన్నారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలంటే చట్టపరంగా నిలబడే నిర్ణయాలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పలువురు బీసీ న్యాయవాదులు కూడా బీసీ రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, న్యాయపరమైన అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రసన్నకుమార్, సాలార్, త్రిమూర్తులు, బహదూర్ షా, ఏసుబాబు, లక్ష్మీ నారాయణ, శ్రీదేవి, సునీత శ్రీనివాస్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


