అంబాజీపేట: కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ఉల్లంగి సందేశ్ ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. అంబాజీపేట క్రికెట్ కోచింగ్ సబ్ సెంటర్ కోచ్లు మట్టా సత్తిబాబు, ఎన్.నగేష్ మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 12 నుంచి జరగనున్న కల్నల్ సీకే నాయుడు క్రికెట్ ట్రోఫీ పోటీల్లో సందేశ్ పాలొంటాడని చెప్పారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు, వివిధ జోన్లలో జరిగిన పోటీల్లో బౌలింగ్లో ప్రతిభ చూపడంతో రాష్ట్ర ఎంపికయ్యాడని వివరించారు.
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్లో కాంస్యం
తుని రూరల్: రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్–14 రెజ్లింగ్ పోటీల్లో తుని మండలం వి.కొత్తూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎల్.మనస్విని కాంస్య పతకం సాధించింది. ఈ నెల 12న పల్నాడులో జరిగిన పోటీల్లో ఆమె మూడో స్థానంలో నిలిచి, ఈ పతకం సాధించిందని ప్రిన్సిపాల్ అమృతవాణి మంగళవారం తెలిపారు. మనస్వినిని ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
సఖినేటిపల్లి: సఖినేటిపల్లిలంక గ్రామంలో గునెశెట్టివారి పుంత రోడ్డు సమీపాన గోదావరి ఒడ్డుకు గుర్తు తెలియని ఓ పురుషుడి మృతదేహం మంగళవారం కొట్టుకువచ్చిందని ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 55 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు.


