రత్నగిరికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది

● అన్నప్రసాద నాణ్యతపై ఈఓ ఆరా

అన్నవరం: దసరా వేడుకలు, విద్యా సంస్థలకు సెలవులు కావడం, ఆదివారం కలసిరావడంతో రత్నగిరి భక్తులతో పోటెత్తింది. సత్యదేవుని దర్శనానికి సుమారు 30 వేల మంది భక్తులు రావడంతో స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,600 జరగగా, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది నిత్యాన్నదాన పథకంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదం నాణ్యతపై ఆల య ఈఓ నల్లం సూర్య చక్రధరరావు భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

నేడు సీఐఐ భాగస్వామ్య సదస్సు

బాలాజీచెరువు: జేఎన్‌టీయూకేలో సోమవారం 31వ భారత పరిశ్రమల భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు ఏపీ ఆర్థిక అభివృద్ధి సంస్థ సీఈఓ ఎస్‌.షణ్మోహన్‌ తెలిపారు. సమావేశ వేదిక, స్టాల్స్‌ నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాట్ల పురోగతిపై నివేదికను కోరారు. సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపారు. ఈయన వెంట ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రమణారెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పరిశ్రమల కేంద్ర మేనేజర్‌ గణపతి ఉన్నారు.

చీకుధార వద్ద పర్యాటకుల సందడి

రాజవొమ్మంగి: రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలో కిమ్మిలిగెడ్డ గ్రామ సమీపంలోని చీకుధార వద్ద పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. రాజవొమ్మంగి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని ఈ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఈ జలపాతం వద్ద ప్రతిష్టించిన శివలింగం, గ్రామదేవతలు, అనేక ఇతర దేవుళ్ల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇళ్ల స్థలాలు అప్పగించే వరకూ పోరాటం

సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అందజేసిన రూ.వందల కోట్ల విలువైన స్థలాలను లబ్ధిదారులకు స్వాధీనం చేసే వరకూ పోరాటానికి పార్టీ వార్డు ఇన్‌చార్జులు, కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ ఇన్‌చార్జి మార్గాని భరత్‌రామ్‌ పిలుపునిచ్చారు. త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 72 డివిజన్ల ఇన్‌చార్జులు, పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక వీఎల్‌ పురంలోని కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద జరిగే మహాధర్నాకు ప్రతి డివిజన్‌ నుంచి ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులను తీసుకురావాలని సూచించారు.

రైతులకు నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.వందల కోట్లు చెల్లించి కానవరం, బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో భూములు సేకరించారని, కుటుంబానికి 50 గజాల చొప్పున రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్తిని పట్టాల రూపంలో అందజేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ స్థలాలను లబ్ధిదారులకు అప్పగించకుండా, వాటిని రద్దు చేసి టిడ్కో ఇళ్ల పేరుతో మోసం చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్నందున కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓట్లు పడవేమోననే భయంతో కచ్చితంగా ఆ స్థలాలు లబ్ధిదారులకు అప్పగించి తీరుతుందన్నారు. ప్రభుత్వాలు మారినా.. ముఖ్యమంత్రిగా ఎవరున్నా సర్వే నంబర్లు, ప్లాట్‌ నంబర్లతోపాటు అందజేసిన ఆ స్థలాలపై హక్కు పేదలదేనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement