వంద కోట్ల కుంకుమార్చనలు లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వంద కోట్ల కుంకుమార్చనలు లక్ష్యం

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

● శ్రీపీఠం నిర్వాహకుడు పరిపూర్ణానంద స్వామీజీ

● తొలిరోజు వేలాదిగా వచ్చిన మహిళలు

కాకినాడ రూరల్‌: అమ్మవారి అనుగ్రహ సాధనలో కాలం, మాట, అవకాశం ఎంతో ముఖ్యమైనవని శ్రీపీఠం నిర్వాహకుడు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ పేర్కొన్నారు. పీఠంలో ఆదివారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్వామిజీ ఆధ్వర్యంలో మూడేళ్ల కిందట ప్రారంభించిన మహాశక్తి యాగం నాలుగో ఏడాదికి చేరింది. ఈ దసరా ఉత్సవాలలో వంద కోట్ల కుంకుమార్చలు చేపట్టేందుకు మహాశక్తి యాగం–2026కు భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం వేలాది బహిళలు దీక్షా వస్త్రాలను ధరించి పీఠానికి హాజరయ్యారు. భక్తుల సంఖ్యను బట్టి సప్తమి లేదా అష్టమి నాటికే శత కోటి కుంకుమార్చనలు పూర్తవుతాయని భావిస్తున్నట్టు స్వామీజీ పేర్కొన్నారు. మహాశక్తి యాగ ప్రాంగణంలోని వేదికపై ఉన్న లలితా అమ్మవారు, లక్ష్మి దేవి, వారాహి దేవి, శ్రీ భూ దేవి సమేత వెంకటేశ్వరస్వాములకు ఆయన హారతి ఇచ్చి, భక్తులతో సంకల్పం చేయించి రెండు సార్లు లలితా సహస్ర నామాలతో కుంకుమార్చలు చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement