అప్రకటిత ఎమర్జెన్సీ తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

అప్రకటిత ఎమర్జెన్సీ తొలగించాలి

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని తొలగించాలని సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం సహా వివిధ రాజకీయ పక్షాలు, కాక్రోచ్‌ జనతా పార్టీ, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వైపు వచ్చే రైళ్లను రద్దు చేయడం, మెట్రో సర్వీసులు నిలిపివేయడం ఎమర్జెన్సీ కాలం కంటే నిరంకుశంగా ఉందన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శితో సహా అనేక మంది వివిధ ప్రజా సంఘాల నాయకులను, సీనియర్‌ సిటిజన్స్‌ అని కూడా చూడకుండా ఢిల్లీ పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. విద్యార్థినులపై పోలీసు ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. అదేవిధంగా విజయవాడలో కూడా విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ చర్యలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కేఎస్‌ శ్రీనివాస్‌, నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement