ముస్తాబైన రత్నగిరి | - | Sakshi
Sakshi News home page

ముస్తాబైన రత్నగిరి

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

అన్నవరం: దసరా ఉత్సవాలకు రత్నగిరి ముస్తామైంది. ఆదివారం నుంచి సత్యదేవుని ఆలయంతో పాటు వనదుర్గ, కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. దీనికోసం ఆయా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. 20వ తేదీ మంగళవారం విజయ దశమి వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ అమ్మవార్లకు కుంకుమ పూజలు చేస్తారు. విజయ దశమి రోజున ఉదయం 11 గంటలకు రత్నగిరిపై చండీహోమం జరుపుతారు. అదే రోజు రాత్రి కొండదిగువన శమీ పూజతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆయా రోజుల్లో వనదుర్గమ్మ, కనకదుర్గ అమ్మవార్లు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా తొలిరోజు ఆదివారం బాలాత్రిపురసుందరి అమ్మవారిగా అలంకరణ ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలకు సత్యదేవుని ఆలయంలో పండితులు కలశస్థాపన చేసి దసరా వేడుకలకు అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా గణపతి పూజ, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుంకుమ పూజలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించే 44 మంది రుత్విక్కులు, 16 మంది అర్చకస్వాములకు అధికారులు దీక్షా వస్త్రాలు అందజేయనున్నారు.

నేటి నుంచి దసరా ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement