సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

కాకినాడ క్రైం: పారా మెడికల్‌ ఉద్యోగుల సమ్మె శనివారంతో ముగిసింది. ఆందోళన చేస్తున్న నాయకులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి బెదిరించడంతో ఆందోళనకారులు సమ్మె విరమించారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొనడంతో తప్పని పరిస్థితుల్లో ఆందోళన విరమించారు. వివిధ వర్గాల మద్దతు వృథా అయ్యింది. రెగ్యులరైజేషన్‌ సహా నూరు శాతం గ్రాస్‌ శాలరీ మరికొన్ని డిమాండ్లతో పోరు బాట పట్టిన ఉద్యోగులు ప్రభుత్వ బెదిరింపులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది.

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌ వద్ద ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ నాయకులు చేస్తున్న ఆందోళన శనివారం కూడా కొనసాగింది. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, చర్చలకు పిలిచిన ప్రభుత్వం తమ డిమాండ్లను ఇంకా పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జీవన్‌, రాజు, టి.ప్రశాంతి, జగదీష్‌, భవాని, స్వాతి, కేఎస్‌ ప్రభాకర్‌, ఆర్‌ సురేష్‌, ఆర్‌ రాణి పాల్గొన్నారు.

బెదిరింపు నోటీసులతో ఆందోళన విరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement