సాయంలోనూ నిసాకారమేనా? | - | Sakshi
Sakshi News home page

సాయంలోనూ నిసాకారమేనా?

Oct 11 2026 12:15 AM | Updated on Oct 11 2026 12:15 AM

● ముంపు బాధితులకు కుళ్లిన ఉల్లి,

బంగాళదుంపల పంపిణీ

● కాలువల్లో పడేస్తున్న మత్స్యకారులు

● ఇదేం సహాయమని ఆవేదన

కొత్తపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన బాధితులకు, మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన సహాయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వారికి కుళ్లిన కూరగాయలు అందించడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, అమరవల్లి, పొన్నాడల్లోని 8492 బాధిత కుటుంబాలకు ఒక్కింటికి 50 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలను ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. వారికి రేషన్‌ షాపు ద్వారా ఇచ్చే ఉల్లిపాయలు, బంగాళదుంపలు కుళ్లిన దశలో ఉండడంతో వాటిని లబ్ధిదారులు కాలువల్లో పడేస్తున్నారు. మిగిలిన సరకులైనా నాణ్యమైనవి ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్‌ నియోజకవర్గంలో తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు అందించే సరకులు నాణ్యత లేకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిపై తహసీల్దారు చిన్నారావును వివరణ కోరగా బాధిత మత్స్యకారులకు మొదటి విడతగా ఐదు వేల కుటుంబాలకు ఉల్లిపాయలు, బంగాళ దుంపలు వచ్చాయని, ఇప్పటికే వాటిని పంపిణీ చేశామని, పాడైనవి పంపిణీ చేయవద్దని సిబ్బందిని ఆదేశించినట్టు తెలిపారు. మిగిలిన సరకులు సత్వరం పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement