ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి మోసకారి. కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉంటామని వలంటీర్ ఉద్యోగంపై ఆధారపడితే అధికారంలోకి రాగానే తమను చెప్పా పెట్టకుండా తొలగించాడు. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేశారు. వలంటీర్లను తొలగించం, జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి నాయకులు నేడు ఎటువంటి సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.
–బండారు రామశివ, మాజీ వలంటీర్, దివిలి, పెద్దాపురం మండలం
నిరుద్యోగ యువతకు వెన్నుపోటు
జీతాలు 10 వేలకు పెంచుతామని సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతను వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్లను తొలగించి అన్యాయం చేశారు. ప్రభుత్వ సొమ్ము దుబారా చేస్తూ సోషల్ మీడియాలో సొంత డప్పు కొట్టడానికి ఇన్ఫ్లయెన్సర్లకు డబ్బులు ఇస్తామనడం బాధాకరం. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి, ప్రభుత్వ సొమ్ము పచ్చ నేతలకు దోచిపెడుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో యువకులకు ఉపాధి లభించింది. ఆయన చొరవతో కరోనా కాలంలోనూ విశేష సేవలు అందించాము. –నైనాల విష్ణువర్ధన్, మాజీ వలంటీర్, ఆత్రేయపురం


