బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ డ్వామా పీడీగా ఆర్.విజయరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం డ్వామా పీడీగా పనిచేస్తున్న మధుసూదన్‌ను నెల్లూరు జిల్లా జెడ్పీ సీఈవోగా బదిలీ చేశారు. ప్రస్తుతం విజయరాజు తూర్పుగోదావరి జిల్లా డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
పశ్చిమ గోదావరి
జెడ్పీ సీఈఓగా రమణ
సామర్లకోట: పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జి.రమణను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆయన సామర్లకో విస్తరణ శిక్షణ కేంద్రంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఈ కేంద్రంలో గెజిటెడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా వివిధ శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ జెడ్పీని మూడుగా విభజించడంతో సీనియర్ అధికారి రమణను పశ్చిమ గోదావరి జిల్లా సీఈఓగా నియమించారు. ఆయన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయనను కేంద్రం ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీలు అభినందించారు.


