సర్‌ ప్రక్రియను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ ప్రక్రియను రద్దు చేయాలి

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే అక్రమ నిర్బంధాలకు పాల్పడడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు అన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 10న ఢిల్లీలో జరుగుతున్న ర్యాలీకి మద్దతుగా శుక్రవారం కాకినాడలో ర్యాలీకి పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధించడం దుర్మార్గమన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం సాగుతున్న సర్‌ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అర్హుల పేర్లు తొలగించకుండా జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం బలపడేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాకినాడలో ఆందోళనలు, నిరసనలు అణగదొక్కడం కోసం పోలీసులతో ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తుందని అన్నారు. ర్యాలీ జరగకుండా ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.సత్యం, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ లోవరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement