గోతిలో దిగబడిన లారీ | - | Sakshi
Sakshi News home page

గోతిలో దిగబడిన లారీ

Sep 20 2026 12:09 AM | Updated on Sep 20 2026 12:09 AM

ఆలమూరు: మండలం పినపళ్ల నుంచి రైస్‌ మిల్లుకు వెళ్తున్న నూకల లోడు లారీ స్థానిక ఎస్సీ పేట వద్ద పచ్చని పంట పొలాల పక్కన ఉన్న గోతిలో ఒరిగిపోయి పక్కనే ఉన్న హై వోల్టేజీ విద్యుత్‌ స్తంభం వద్దకు వచ్చి ఆగిపోయింది. లారీ ఏ మాత్రం స్తంభాన్ని ఢీకొన్నా పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు నుంచి వెదురుమూడి వెళ్లే రహదారిలో స్థానిక పశువుల ఆస్పత్రి నుంచి మురుగుకాలువ వరకూ సుమారు మూడు కిలోమీటర్ల రహదారిలో ఓఎన్జీసీ రిగ్‌, పేపర్‌ మిల్లు, రైస్‌ మిల్లులతో పాటు పలు ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇన్ని పరిశ్రమలు ఈ మార్గంలో ఉన్నప్పటికీ ఈ రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ఓఎన్జీసీ అధికారులు సత్వరం స్పందించి రహదారి అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

● హెచ్‌టీ లైన్‌ వద్దకు వచ్చి

ఆగిన వాహనం

● తప్పిన పెను ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement