మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి | - | Sakshi
Sakshi News home page

మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి

Sep 9 2026 12:17 AM | Updated on Sep 9 2026 12:17 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎరువుల కొరత, ధాన్యం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కమిటీలతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కలసికట్టుగా స్థానిక సంస్థల్లో నడవాలి.

– వంగా గీత, మాజీ ఎంపీ

కూటమిది రాక్షస ప్రభుత్వం

కూటమిది రాక్షస ప్రభుత్వం. ప్రజలకు చేస్తున్న అరాచకాలపై అవగాహన కల్పించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ వాగ్దానం నెరవేరడం లేదు. కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కూటమి పాలన, టీడీపీ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలి.

– తోట నరసింహం, మాజీ మంత్రి

జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. కార్యకర్తలపై కూటమి నాయకులు ఎన్ని కేసులు పెడుతున్నా భయపడకుండా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నారు. ఇదే తీరుతో కూటమి నేతల అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి.

– దవలూరి దొరబాబు, పెద్దాపురం కోఆర్డినేటర్‌

ఐక్యతతో విజయం సాధిద్దాం

వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించారు. వైఎస్‌ జగన్‌ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పోటీ చేయాలని, గెలుపు సాధించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వార్డుల సభ్యుల నుంచి మేయర్‌ వరకు పార్టీ నుంచి పోటీ చేద్దాం. సమష్టిగా కష్టపడి విజయం సాధిద్దాం.

– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్‌

బీసీ రిజర్వేషన్‌ కుదించే కుట్ర

బీసీల రిజర్వేషన్‌ 24 శాతానికి కుదించే కుట్రలో భాగంగానే ప్రతాప్‌రెడ్డితో కోర్టులో కేసు వేయించారు. గత స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు వదిలేశాడు. కార్యకర్తలను పట్టించుకోలేదు. పోరాటానికి వెన్నుచూపనని చెప్పిన నేత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. జగన్‌ అంటేనే ఒక పవర్‌. ఆయన్ను తలచుకుని పోటీ చేయండి. ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కాడు.

– చెల్లుబోయిన వేణు, మాజీ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement