వెన్నుపోటు పార్టీ నడుపుతున్న చంద్రబాబు ప్రతి ఒక్కరినీ పోట్లు పొడుచుకుంటూ వెళుతున్నాడు. షాడో సీఎంగా లోకేష్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. స్థానిక సంస్థల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబును ప్రశ్నించగలిగిన దమ్ము, ధైర్యం వైఎస్ జగన్‌కే ఉంది. కష్టాలు చెప్పుకొనేందుకు ఎవరికై తే గళం ఉండదో వారి తరపున పోరాడతామని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఎకరం రూ.99 పైసలకే చంద్రబాబు అమ్మేస్తున్నాడు.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్
రాష్ట్రంలో నియంత పాలన
రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోంది. యువత బయటకు వస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ చార్జీలు తడిసిమోపెడయ్యాయి. గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలు మొదలయ్యాయి. పంట చేలకు సాగునీరు లేదు. చంద్రబాబు పొడిచిన పోట్లకు ఏ వర్గం కూడా తేరుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పరిపాలనను దిగజార్చారు. రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలు విసిగిపోయారు.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిపించుకున్న అభ్యర్థులను కూటమి కిడ్నాప్ చేసి తమ పార్టీలో కలిపేసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ నేరుగా ఎన్నుకునే అవకాశం ఉంది. గడప గడపకు వైఎస్సార్ అని ప్రతి ఇంటి తలుపు తట్టాం. కానీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు గట్టిగా పది ఇళ్లు కూడా తిరగలేకపోతున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి.
– ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే


