అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సుమారు 50 వేల మంది స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు నాలుగు వేలు జరిగాయని చెప్పారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని వివరించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని ఆరు వేల మంది భక్తులు స్వీకరించారని చెప్పారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి.


