అనుమతి లేకుండా..
శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఓ రియల్టర్ సర్వే నంబర్ 180లో 1.80 ఎకరాల్లో లే అవుట్ వేసేశారు. అనుమతులు లేకుండా ప్లాట్లుగా విభజించేశారు. నంబర్ రాళ్లు సైతం పాతేశారు. ప్లాట్ల విభజన జరుగుతున్నప్పుడు కట్టడి చేయాల్సి క్షేత్ర స్థాయి అధికారులు ఆమ్యామ్యాలు తీసుకుని మిన్నకుండిపోయారు. ఇటీవల ప్లాట్ల తనిఖీలు చేపట్టిన కౌడా అధికారులు దీనిని అక్రమ లే అవుట్‌గా గుర్తించారు.
కన్నెత్తి కూడా చూడటం లేదు
తొండంగి మండలం బెండపూడిలో సర్వే నంబర్ 59–4ఏలో 0.84 ఎకరాల్లో అనధికారిక లే అవుట్ వెలసింది. ఏకంగా విద్యుత్ స్తంభాలు, అంతర్గత రహదారులు సైతం ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా క్షేత్ర స్థాయి అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవు. కౌడా అధికారులు దీనిని ఇటీవల అక్రమ లే అవుట్‌గా గుర్తించారు.


