ఉద్యమమే
● ఏపీ జేఏసీ అమరావతి
జిల్లా కార్యవర్గ సభ్యులు
● డీఆర్వోకు వినతిపత్రం అందజేత
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గ సభ్యులు హెచ్చరించారు. ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు బుధవారం నాయకులు డీఆర్వోను కలిసి వినతి పత్రం అందజేశారు. తమ 29 డిమాడ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వాలని, ధరలు పెంపునకు అనుగుణంగా పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్‌ను పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలను పోషించుకోవడానికి అవసరమైన జీత భత్యాలు పెంపు చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులను వినియోగంలోకి తేవాలన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 3, 5 తేదీల్లో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలి రావాలన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా చైర్మన్ పితాని త్రినాథ్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


