మద్యం మత్తులో పవన్ కల్యాణ్ అభిమానుల వీరంగం
అంబాజీపేట: మద్యం మత్తులో కారు నడుపుతున్న ఇద్దరు యువకులు గంగలకుర్రు అగ్రహారం పెదపాలెం వద్ద కిళ్లీబడ్డిని ఢీ కొట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కొందరు యువకులు కారులో మద్యం తాగి, కేరింతలు కొడుతూ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ పెదపాలేనికి చెందిన మట్టపర్తి శ్రీనివాస్ కిళ్లీ బడ్డీని బలంగా ఢీ కొట్టారన్నారు. బడ్డీని ఢీ కొటిన వెంటనే ఆ యువకులు అక్కడ నుంచి పరారయ్యారన్నారు. కారులో మద్యం సీసాలు ఉన్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపారు.


