ఆలమూరు: అంతర్జాతీయ గోల్‌షాట్ బాల్ ఛాంపియన్‌షిప్ (2026) పోటీలకు సంబంధించి ఇటీవల భూటాన్‌తో జరిగిన పోటీల్లో ఇండియా విజయం సాధించింది. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన సహచర జట్టు క్రీడాకారులతో కలిసి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి దేశానికి స్వర్ణ పతకం సాధనలో కీలకపాత్ర పోషించిన ఉండ్రాసపు విలియం కేరీ స్వగ్రామం ఆలమూరు మండలం మడికికి బుధవారం చేరుకున్నారు. ఆయనకు గ్రామస్తులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం స్థానిక బస్టాండు సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయనను సత్కరించారు. కేరిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులు సుందర విజయం, రాజమణిని అభినందించారు.


