అంబాజీపేట: పొద్దెక్కినా భానుడు రాడేమని బయటకు వచ్చి చూసిన ప్రజలు వినీలాకాశంలో నీలి మబ్బుల చినుకు స్పర్శకు మురిసిపోయారు. ఒక్కసారిగా చినుకులల్లా భారీ వర్షంలోకి మారడంతో వారి సంతోషం అంతా ఇంతా కాదు. ఎల్‌నినో ప్రభావంతో వాన చినుకుకు కరువు వాచిన ప్రజలు బుధవారం 8 గంటల నుంచి కురిసిన భారీ వర్షానికి కొంత సేద తీరారు. కారు మబ్బులకు, భారీ వర్షానికి దారి కనిపించక వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. వర్షానికి వారపు సంతలో వ్యాపారులు, కొనుగోలుదారులు అసౌకర్యానికి గురయ్యారు.


