అమలాపురం రూరల్: పింఛన్ సొమ్ముతో తాను పారిపోలేదని రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందు వల్ల పింఛన్ల పంపిణీకి రాలేకపోయినట్టు బండారులంక సచివాలయం –1 డిజిటల్ అసిస్టెంట్ శివశంకర్ అధికారులు బుధవారం లేఖ పంపించారు. మంగళవారం ఉదయం పెన్షన్ల పంపిణీకి యానాం నుంచి వస్తుండగా వాహన్ అదుపు తప్పి గాయాలయ్యాయని, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందానని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ డిస్‌ప్లే పోవడంతో ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయానని, పెన్షన్ సొమ్ములు పంపే ప్రయత్నం చేసినా కుదరలేదని తెలిపారు. మా చిన్నమ్మకు ఆ సొమ్ములు పంపుతున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న ఎస్సై చైతన్యకుమార్ మాట్లాడుతూ అతని బంధువుల ద్వారా పెన్షన్ల సొమ్ము రూ.3.11 లక్షలను పోలీసుల సమక్షంలో బండారులంక కార్యదర్శి శ్రీనివాస్‌కు అందజేసినట్టు తెలిపారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ దుడ్డి రాంబాబు, మాజీ ఉప సర్పంచ్ పిచ్చిక శ్యామ్‌కుమార్ సచివాలయ ఉద్యోగులు ద్వారా పెన్షన్ సొమ్ములు పంపిణీ చేశారు.


