వెలుగు చూస్తున్న గౌస్‌ మొహిద్దీన్‌ దారుణాలు | - | Sakshi
Sakshi News home page

వెలుగు చూస్తున్న గౌస్‌ మొహిద్దీన్‌ దారుణాలు

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

ఇప్పటికే మూడుసార్లు జైలుకు

అయినా మారని తీరు

కాకినాడ క్రైం: ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తూ, వారి మతాలు మార్చిన ప్రబుద్ధుడు కాకినాడకు చెందిన షేక్‌ గౌస్‌ మొహిద్దీన్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగన్నాథపురం జె.రామారావుపేట చిన మార్కెట్‌లో మటన్‌ దుకాణం నిర్వహించే గౌస్‌ మటన్‌లో బీఫ్‌ కలిపి అమ్మేవాడని అతడి బాధితులు చెబుతున్నారు. ఈ పంచాయితీ పోలీసుల వద్దకు కూడా వెళ్లింది. మిలిటరీ రోడ్డులోని ఓ హోటల్‌కు మటన్‌లో బీఫ్‌ కలిపి రోజూ పంపిణీ చేసేవాడని, వంట చేసే వ్యక్తులు గుర్తించి, యజమాని అయిన యువతికి చెప్పడంతో ఆమె నిలదీసిందని సమాచారం. దీంతో, ఆమైపె నడిరోడ్డు మీద దాడి చేశాడని తెలిసింది. దీనిపై బాధితురాలు కాకినాడ టూ టౌన్‌, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో గౌస్‌ అరెస్టయి జైలు పాలయ్యాడు. అంతకు ముందు కూడా ప్రేమ పేరుతో వంచించడంతో బాధిత మహిళల ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో కూడా రెండుసార్లు జైలు ఊచలు లెక్క పెట్టాడు. ఇదిలా ఉండగా గౌస్‌ను వివాహం చేసుకున్న రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు, కాకినాడ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో వారెంటు వేసి గౌస్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

గౌస్‌కు కానిస్టేబుల్‌ అండ!

నిందితుడు గౌస్‌కు ఓ కానిస్టేబుల్‌ అండగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వన్‌టౌన్‌ నుంచి టూటౌన్‌కు బదిలీ అయిన అతడు ఎక్కడ పని చేస్తే ఆ పరిధిలోని హిందూ మహిళలపై గౌస్‌ పక్కా ప్రణాళికతో కన్ను వేసేవాడని తెలిసింది. ఆ కానిస్టేబుల్‌ పని చేస్తున్న స్టేషన్‌ పరిధిలోని హోటళ్ల నుంచి అతడి సిఫారసుతో మటన్‌ ఆర్డర్లు తీసుకునేవాడని సమాచారం. ఏ తేడా వచ్చినా గౌస్‌కు ఆ కానిస్టేబుల్‌ అండగా నిలిచేవాడని తెలిసింది. గౌస్‌పై గతంలో ఫిర్యాదు చేసేందుకు ఆయా స్టేషన్లకు వెళ్లిన మహిళలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించడం గమనార్హం.

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా

నరేష్‌ కుమార్‌

కాకినాడ క్రైం: జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ పాట్నీడి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ లావణ్య కుమారి నెల రోజుల వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్ధన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్‌ సర్జరీ విభాగాధిపతిగా ఉన్న నరేష్‌ కుమార్‌ పూర్తి అదనపు బాధ్యతల్లో సూపరింటెండెంట్‌గా కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement