బాల్య వివాహం నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం నిలిపివేత

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

రంగంపేట: మండలంలోని ఈలకొలను గ్రామంలో 17 బాలికకు వివాహం చేసేందుకు జరుగుతున్న ఏర్పాట్లను ఐసీడీఎస్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈలకొలను గ్రామానికి చెందిన అంచూరి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల 17 ఏళ్ల కుమార్తెకు అదే గ్రామానికి చెందిన కురుకూరి గవర్రాజు, మంగ దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్‌తో శుక్రవారం రాత్రి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ స మయానికి చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి ఎం. నరేష్‌ బాబు, వీఆర్వో భాస్కరరావు తదితరులు వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం శనివారం ఉదయం ఐసీడీఎస్‌ రంగంపేట ప్రాజెక్టు అధికారి కె. కష్ణవేణి ఆధ్వర్యంలో సెక్టర్‌ సూపర్‌వైజర్‌ ఆర్‌.నందీశ్వరి, వీఆర్వో పి.భాస్కరరావు, కార్యదర్శి ఎంఎస్‌కే శ్రీలక్ష్మి, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామానికి చేరుకుని బాలిక, బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికకు 18 దాటకుండా వివాహం చేస్తే ఎదురయ్యే శారీరక, సామాజిక సమస్యలను వివరించి నిర్ణీత వయసులోపు వివాహం చేయబోమని అంగీకార పత్రం తీసుకున్నారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు సమాచారం అందించాలని, బాలల భద్రత విషయంలో ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వికాసలో రేపు జాబ్‌మేళా

బోట్‌క్లబ్‌: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ లచ్చారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, మెట్‌లైఫ్‌ కంపెనీలో చీఫ్‌ ఇన్స్యూరెన్స్‌ మేనేజర్‌, ఏరియల్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ కంపెనీలో ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, టెలికాలర్‌, ఆఫీస్‌ అటెండర్‌, ఫీల్డ్‌ సపోర్ట్‌ అసిస్టెంట్‌, రాయల్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో ఫైనాన్సియల్‌ అసోసియేట్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌, టెలీ కాలర్స్‌, ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ఫాక్స్‌ కాప్‌ కంపెనీలో మొటైల్‌ ఆపరేటర్‌, ప్రీమియర్‌ ఎనర్జీస్‌ కంపెనీ లో టెక్నీషియన్‌ ఆపరేటర్‌, హెల్పర్లు, టీవీఎస్‌ (సుందరం ఫాస్ట్చెర్స్‌ లిమిటెడ్‌) కంపెనీలో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ., డిప్లొమా, బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకూ జీతం, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో పాల్గొనాలని పీడీ కోరారు.

బాలిక తల్లిదండ్రులకు ఐసీడీఎస్‌,

చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారుల కౌన్సెలింగ్‌

నిర్ణీత వయసు లోపు వివాహం చేయబోమని అంగీకారపత్రం స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement