సన్నబియ్యం ధరలు గత మూడు నెలల్లో భారీగా పెరిగాయి. మే 1తో పోలిస్తే పాత బియ్యం 26 కిలోల బస్తాపై రూ.200 నుంచి రూ.300 వరకూ ధర పెరిగింది. క్వింటాల్ సన్నబియ్యం మే 1న రూ.5,600 నుంచి రూ.5,800 వరకూ విక్రయించేవారు. ప్రస్తుతం అది రూ.6,500 నుంచి రూ.7,500 వరకూ పలుకుతోంది. సాధారణ రకం బియ్యం ధర క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెరిగింది. బీపీటీ రకం క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.5,750కు చేరింది. కిలో సన్న బియ్యం ధర ప్రస్తుతం రూ.65 నుంచి రూ.70కి పైగా చెబుతున్నారు.
చేదెక్కిన చక్కెర
పండగల సీజన్ వేళ చక్కెర చేదెక్కింది. మొన్నటి వరకూ కిలో చక్కెర రూ.46 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.72కు పెరిగింది. దీనికి అనుగుణంగా బేకరీ తినుబండారాలు, స్వీట్ల ధరలు కూడా పెరిగాయి.
ఉడకని పప్పులు
కందిపప్పు ధర గతంలో రూ.140 వరకూ ఉండేది. ప్రస్తుతం అది రూ.164 పలుకుతోంది. పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటి వాటి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.
● కొండెక్కిన
నిత్యావసరాలు
● భారిగా పెరిగిన బియ్యం రేట్లు
● కాగుతున్న వంటనూనెలు
● కొందామంటే కూరగాయాలే
● పండగల వేళ చుక్కలు చూస్తున్న జనం
● చోద్యం చూస్తున్న ప్రభుత్వం


