పాలు, పెరుగు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచదార ధరలు విపరీతంగా పెరిగాయి. తీపి వస్తువులు తినాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం దారుణం.
– వర్ధినీడి సుజాత, వైఎస్సార్ సీపీ
మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
బాదుడే బాదుడు
ఎన్నికల ముందు చంద్రబాబు అండ్ కో బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరుగుతున్నా నియంత్రణను గాలికొదిలేశారు.
– రాగిరెడ్డి చంద్రకళాదీప్తి,
కాకినాడ నగరాభివృద్ధి సంస్థ మాజీ చైర్‌పర్సన్


