వెలుగు చుక్కలు | - | Sakshi
Sakshi News home page

వెలుగు చుక్కలు

Jan 3 2026 6:55 AM | Updated on Jan 3 2026 6:55 AM

వెలుగ

వెలుగు చుక్కలు

విద్యాబోధన

మామూలు విద్యార్థులకూ అంధులైన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగలరు. సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే సేవలు అందించగలరు. వీరి కోసం పాఠ్య పుస్తకాలను ప్రత్యేక బ్రెయిలీ లిపిలోకి ముద్రిస్తారు. వాటిని స్పర్శిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు.

అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి

ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం

అన్ని రంగాల్లో ముందంజ

రేపు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం

రాయవరం: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తూ మరి కొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసనల ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకొంటున్నారు.

అంచలంచెలుగా..

సాధారణంగా చదువు కోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేని కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీని కోసం స్పెయిన్‌కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్‌ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది.

ఆరు చుక్కల లిపి

కేవలం చేతి వేళ్లతో ఆరు చుక్కలను స్పర్శించి అక్షర జ్ఞానాన్ని పొందడానికి అనువుగా లూయిస్‌ బ్రెయిలీ ఈ లిపిని రూపొందించారు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలు ఉంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబరు ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తు పెట్టుకుని, మనో నేత్రంతో చదువుతూ విద్యను అభ్యసిస్తున్నారు. లూయిస్‌ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకొంటున్నారు.

పట్టుదలతో..

పారిస్‌ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్‌ బ్రెయిలీ జన్మించారు. మూడేళ్ల వయసులో తండ్రి దుకాణంలో పనిముట్లతో ఆడుకుంటుండగా, ఒక పనిముట్టు ఆయన కుడి కంటికి తగలడంతో చూపును కోల్పోయారు. అయినా పట్టుదలతో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా మారాడు. తనలా బాధపడుతున్న వారి కోసం బ్రెయిలీ ఒక లిపిని కనిపెట్టారు. కేవలం పదిహేనేళ్ల వయసులో ఫ్రెంచ్‌ వర్ణమాల ఆధారంగా బ్రెయిలీ కోడ్‌ను అభివృద్ధి చేశారు.

ఆత్మ విశ్వాసంతో..

పుట్టుకతోనే అంధత్వంతో జన్మించాను. తల్లిదండ్రులైన మంగమ్మ, వెంకన్నలు నన్ను కంటి పాపలా కాపాడారు. మండపేట అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపి ద్వారా విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం టీచర్‌ శిక్షణ పొంది ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాను. బ్రెయిలీ లిపితో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది.

– వేల్పూరి వీరబాబు, ఎంపీయూపీ స్కూల్‌ ఉపాధ్యాయుడు, వెదురుమూడి, కపిలేశ్వరపురం మండలం

కళ్లు లేవని బాధపడలేదు

కళ్లు లేవని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. పుట్టుకతోనే నా రెండు కళ్లకూ చూపు లేదు. లూయిస్‌ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే పట్టుదలతో చదివాను. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.

– పి.దొరబాబు, ఉపాధ్యాయుడు,

ఎస్‌పీఎస్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూల్‌, రాజకోట,

రామచంద్రపురం,

వెలుగు చుక్కలు1
1/4

వెలుగు చుక్కలు

వెలుగు చుక్కలు2
2/4

వెలుగు చుక్కలు

వెలుగు చుక్కలు3
3/4

వెలుగు చుక్కలు

వెలుగు చుక్కలు4
4/4

వెలుగు చుక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement