త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం
అనపర్తి: అనపర్తి శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో 27వ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన వీఎల్ తులసీ విశ్వనాథ్ గాత్ర కచేరీతో మొదటి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. మారెళ్ల పురుషోత్తమశర్మ, సీతామహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం, వారి కుమారుడు, ఆడిటర్ మారెళ్ల గంగరాజుశర్మ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మల్లిడి మాలతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కుమారి వి.నీరజ సహకార గానంతో పి.నందకుమార్ వయోలిన్, బి.సురేష్ బాబు మృదంగం సహకారం అందించారు. కార్యక్రమంలో కళాసమితి అధ్యక్షుడు తమలంపూడి చిన ఆదిరెడ్డి, ఉపాధ్యక్షుడు నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, మారెళ్ల శ్రీకృష్ణ ఫణీంద్ర, సభ్యులు పాల్గొన్నారు.
త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం


