మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి | - | Sakshi
Sakshi News home page

మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి

Dec 26 2025 8:18 AM | Updated on Dec 26 2025 8:18 AM

మెట్ల

మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి

ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశృతి

రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ములసమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్‌కుమార్‌ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించారు.

అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం

అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్‌ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు.

సగరుకు

ఎమ్మెల్సీ పదవి ఇవ్వావి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సగర కులస్తులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి డిమాండ్‌ చేశారు. స్థానిక సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా ములికి సత్యనారాయణ, అధ్యక్షుడిగా కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నక్క కిశోర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నాటి అప్పలస్వామి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా నక్క వీర వెంకట్రావు, శ్రీను, కోశాధికారి తంగెళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సగరులు కలిసికట్టుగా ఉంటే అనుకున్నది సాధించవచ్చునన్నారు. త్వరలోనే కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి, సగరుల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలన్నారు. తొలుత భగీరథుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సగర కుల నాయకులు పాల్గొన్నారు.

మెట్ల పైనుంచి పడి  కళాకారిణి మృతి 1
1/1

మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement