అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


