● రక్షణ లేదిక్కడ!
రెండు మార్గాలను కలిపేవే వంతెనలు.. అలాంటి వారధుల నిర్వహణను అధికారులు గాలికొదిలేయడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. కూలేందుకు సిద్ధంగా తయారవుతున్నాయి. యు.కొత్తపల్లి మండలం కాశివారిపాకలు – కొండెవరం రోడ్డులో గోదావరి కాలువపై దశాబ్దాల కిందట నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. దీని రక్షణ గోడ ఓవైపు పూర్తిగా, మరోవైపు సగం కులిపోయింది. మిగిలింది శిథిలావస్థలో ఉంది. అప్రోచ్ సరిగ్గా లేదు. దీంతో, ఇటుగా ప్రయాణించాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఇదే వంతెనపై నుంచి కొండెవరంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులు వెళ్తుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. రక్షణ గోడలు లేకపోవడంతో ఏమాత్రం అదుపు తప్పినా కాలువలోకి జారి పడే పరిస్థితి. ఈ వంతెన రక్షణకు సంబంధిత అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
– కొత్తపల్లి
గోదావరి కాలువపై రక్షణ గోడలు కూలి ప్రమాదకరంగా మారిన వంతెన


