
అక్టోబర్ 7న తెలుగు సాహిత్య సదస్సు
రాజానగరం: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని వైఎన్ కళాశాలలో అక్టోబర్ 7న శ్రీతెలుగు సాహిత్యం – భాషా బోధన మనోవికాసంశ్రీ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగనుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ని సోమవారం విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దక్షిణాంధ్రయుగ సాహిత్యం, శతక సాహిత్యం, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, జానపద, గిరిజన విజ్ఞానం, ప్రాథమిక, ఉన్నత విద్య, మాతృ భాష బోధన అంశాల పై పరిశోధన పత్రాలను సెప్టెంబర్ 25లోపు పంపించాలన్నారు. కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ పిట్టా శాంతి పాల్గొన్నారు.