
కన్నబాబుకు ముఖ్య నేతల పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబును శనివారం పలువురు ముఖ్య నేతలు పరామర్శించారు. కాకినాడ వైద్యనగర్ నివాసంలో కన్నబాబును పరామర్శించి, ఆయన తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. పరామర్శించిన వారిలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి వీడిక రాజన్నదొర, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్, పాడేరు ఎమ్మెల్యే మత్సరాజు విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కంబ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, బి.అప్పలనాయుడు, కండుబండి శ్రీనివాసరావు, జోగారావు, విశ్వసరాయి కళావతి, పర్వత ప్రసాద్, వైఎస్సార్ సీపీ స్పోక్ పర్సన్ యనమల నాగార్జున యాదవ్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. అలాగే కన్నబాబు, ఆయన సోదరుడు కళ్యాణ్ కృష్ణను ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన పలువురు నేతలు పరామర్శించారు.

కన్నబాబుకు ముఖ్య నేతల పరామర్శ