వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
కొవ్వూరు: కాకినాడ జిల్లా పెద్దాపురంలో శంకరయ్యపేటకి చెందిన వీరవాసరపు ఏసురత్నం అనే వివాహిత 14వ తేదీ తెల్లవారుజాము మూడు గంటల నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. కొవ్వూరులో ఉంటున్న ఆమె అత్త వారి ఇంటికి వేసవి సెలవుల నిమిత్తం వచ్చినట్లు ఆమె తల్లి ఏలేశ్వరపు దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి మరలా తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వివరాలు తెలిస్తే 94407 96622 నంబర్‌కు తెలియజేయాలని ఆయన సూచించారు.
కొబ్బరితోటలో
పిడుగు పడి మంటలు
సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ శబ్ధంతో పడిన పిడుగుపాటుకు ఒక రైతు కొబ్బరి తోటలో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలను స్థానికులు నీళ్లతో ఆర్పివేశారు. పిడుగుపాటుకు చెట్లకు నష్టం వాటిల్లింది.
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు


