అలంపూర్: నియోజకవర్గంలోని పేద ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టితీసుకురావాలని సూచించారు. కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపిల్లల వివాహానికి అండగా నిలుస్తున్నట్లు తెలిపా రు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, వడ్డేపల్లి, మానవపాడు మండలాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.


