సీఎం పర్యటనకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

కోస్గి రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8న కోస్గి పురపాలికలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను బుధవారం డీఎస్పీ లింగయ్య పర్యవేక్షించారు. సర్‌ సీవీ రామన్‌ మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవరణను పరిశీలించారు. భద్రత అంశాలు, పోలీసు విధుల కేటాయింపు, వాహనాల నిర్వహణ, రాకపోకలు, పార్కింగ్‌, ప్రవేశ, నిష్కమణ అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట బందోబస్తు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట సీఐ సైదులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement