అలంపూర్: ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ అభివృద్ధికి సహకార సంఘాల పాలకవర్గాలు తోడ్పాటు అందించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమార్ సూచించారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్–ఆఫీషియల్ పర్సన్స్ ఇన్‌చార్జి చైర్మన్లను నియమిస్తూ.. ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సంపత్‌కుమార్‌ను వారు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, తమను పదవులకు ఎంపిక చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వారు ధన్యవాదాలు తెలిపారు.


