భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

మల్దకల్‌: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు. బుధవారం మల్దకల్‌ మండలం బూడిదపాడులో చేపట్టిన భూ సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఇందుకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మండల అధికారులకు సూచించారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సర్వేను పూర్తిచేయాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఝాన్సీరాణి, సర్వే ఏడీ నూకరాజు ఉన్నారు.

ప్రైవేటీకరణను

అంగీకరించం

గద్వాల న్యూటౌన్‌: లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అంగీకరించే ప్రసక్తే లేదని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఐసీఈయూ) హైదరాబాద్‌ డివిజన్‌ ప్రధానకార్యదర్శి మద్దిలేటి అన్నారు. బుధవారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో నిర్వహించిన ఐసీఈయూ 36 వ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లా డుతూ.. లాభాలతో ఉన్న ఎల్‌ఐసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి పేద, మధ్య తరగతి ప్రజలకు బీమా సౌకర్యాన్ని దూరం చేస్తామంటే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో ఎల్‌ఐసీ ప్రభుత్వాన్ని ఆదుకున్నదే తప్పా.. ప్రభుత్వం ఎల్‌ఐసీకి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శివకుమార్‌, ఉపాధ్యక్షుడిగా మల్లికార్జున్‌, ప్రధానకార్యదర్శిగా బంగి రంగారావు, సంయుక్త కార్యదర్శులుగా సూరజ్‌, రాఘవేంద్ర, కోశాధికారి శైలేష్‌, ఉమెన్స్‌ కమిటీ సభ్యురాలిగా పద్మావతి, డివిజనల్‌ కమిటీ సభ్యులుగా ప్రవీణ్‌, మనీష్‌ ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా వరుసగా 12వ సారి ఎన్నికై న బంగి రంగారావు మాట్లాడుతూ.. యూనియన్‌ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌, సహయకార్యదర్శి రవీందర్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పేర్‌ నరసింహ, వీవీ నరసింహ, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement