పడిపోయిన పత్తి ధరలు | - | Sakshi
Sakshi News home page

పడిపోయిన పత్తి ధరలు

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

గద్వాలవ్యవసాయం/జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం పత్తి ధరలు తగ్గాయి. గత వారం క్వింటా రూ.9వేలకు పైగా పలికిన ధరలు దిగువకు పడిపోయాయి.యార్డుకు 1,070 బస్తాల పత్తి రాగా క్వింటా గరిష్టంగా రూ.8,839, కనిష్టంగా రూ.7,609 ధరలు లభించాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ 2,473 బస్తాలు రాగా గరిష్టంగా రూ.3,528, కనిష్టంగా రూ.2,641 పలికింది. మొక్కజొన్న 23,51 బస్తాలు రాగా గరిష్టంగా రూ.3,230, కనిష్టంగా రూ.2,881ఽ ,వేరుశనగ 215 బస్తాలు రాగా గరిష్టంగా రూ.7,722, కనిష్టంగా రూ.6,012, ఆముదాలు రూ.7,762 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.3,259, కనిష్టంగా రూ.2,500, కేఎన్‌ఎమ్‌ ధాన్యం ధర గరిష్టంగా రూ.3,159, కనిష్టంగా రూ.2,300గా ధరలు నమోదయ్యావి. మార్కెట్‌కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

ఉల్లి ధర రూ.4000

దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. చాలా మంది రైతులు మార్కెట్‌ బయటే బస్తాలుగా విక్రయించారు. 50 కేజీ ఉల్లి బస్తా ధర రూ.2000 వరకు విక్రయించారు. కొత్త ఉల్లి దిగుబడులు రావడంతో చాలామంది రైతులు వాహనాలలో ఉల్లిని తెచ్చి క్వింటాల్‌ రూ.3,000 నుంచి రూ.4000 వరకు విక్రయించారు. వ్యాపారులు రైతులతో ధరలు నిర్ణయించి కొనుగోలు చేశారు.

వేరుశనగ క్వింటా రూ.9,016

గద్వాల వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 657 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,016, కనిష్టంగా రూ. 5,050, సరాసరి రూ. 7,169 ధరలు లభించాయి. అలాగే 27 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 7,839, కనిష్టం రూ. 7,329, సరాసరి రూ. 7,679 ధరలు పలికాయి. 416 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 3,309, కనిష్టంగా రూ. 2,318, సరాసరి రూ. 2,809 ధరలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement