గద్వాల: గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర నోడల్ అధికారి లోకేష్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావుతో కలిసి గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, మెరుగైన ఫలితా లు సాధించేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యే క బోధనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నతవిద్య వరకు విద్యార్థుల చదువు కొనసాగింపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాలబాలికలు ఎవరూ మధ్య లో చదువు మానేయకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులకు పోషకాహారం క్రమం తప్పకుండా అందేలా చూడాలన్నారు. బ్యాంకింగ్ సేవలు, స్వయం సహాయక సంఘాలు, శిశు ఆరోగ్యం, గ్రామీణ పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, చిన్నారులకు పోషకాహారం, మధుమేహ పరీక్షలు వంటి అంశాలలో సాధించిన పురోగతిని ఇదే విధంగా కొనసాగించాలని తెలిపారు. అలాగే స్థానిక సంప్రదాయ ఉత్పత్తులను గుర్తించి వాటి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆ కాంక్ష బ్రాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రచారంతో మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, జాతీయ స్థాయి లో గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. తద్వారా స్థానిక కళాకారులు, మహిళా సంఘాలు, గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని తెలిపారు. సమావేశంలో డీడబ్ల్యూఓ సునంద, డీఆర్డీఓ ముషాయిదాబేగం, ఎంపీడీఓ మహ్మద్ అబ్దుల్, ఈఈ ప్రభాకర్ ఉన్నారు.


