కరువు రక్కసి నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కరువు రక్కసి నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలి

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

బల్మూర్‌/అమ్రాబాద్‌/తెలకపల్లి: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నెలకొన్న కరువు రక్కసి నుంచి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం బల్మూర్‌ మండలంలోని మహాదేవ్‌పూర్‌, అమ్రాబాద్‌ మండలం తిర్మలాపూర్‌ (బీకే), ఉప్పునుంతల (బీకే), పదర మండలం చిట్లంకుంట, పెట్రాల్‌చేన్‌పెంట, తెలకపల్లి మండలం గౌరారం గ్రామాల్లో సీపీఐ రాష్ట్ర బృందం పర్యటించి, ఎండిన పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు లేక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు అప్పుల ఊబీలో కూరుకుపోయారన్నారు. ప్రభుత్వం జిల్లాను తీవ్ర కరువు ప్రాంతంగా ప్రకటించడంతో పాటు పంటలు ఎండిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. అలాగే వచ్చే సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించాలన్నారు. చెంచుపెంటలు, గిరిజన తండాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనర్సింహ, జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌, నాయకులు కె.కేశవులుగౌడ్‌, వి.వెంకటయ్య, పి.విజయ్‌, చంద్రమౌళి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సూర్యశంకర్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, బి.రవీందర్‌, బండి లక్ష్మీపతి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.ప్రేమ్‌కుమార్‌, పి.గోపాల్‌, పరశురాం, నరేందర్‌రెడ్డి, విష్ణు, వంకేశ్వరం శ్రీనివాసులు, వేనేపల్లి రవీందర్‌, మల్లేష్‌, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement