తుంగభద్ర నదికి నీరు వచ్చిందని అంటున్నారు. మళ్లీ రోజులు గడవక ముందే తుమ్మిళ్ల మోటార్లు ఆఫ్ చేశారని అంటున్నారు. అప్పుడే ఊరించి.. ఉసూరుమనిపిస్తున్నారు. నీరు కనీసం మా పొలాలకు వచ్చేలోగానే మోటార్ ఆఫ్ చేశారని తెలిసి ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటికీ మూడుసార్లు తుమ్మిళ మోటార్ ఆన్ చేస్తే పూర్తి తడులు అందివ్వలేక.. మా పత్తి పంటను ఆగం చేసుకున్నాను.
– నర్సింహారెడ్డి, రైతు, పైపాడు
మోటార్‌కు అందట్లేదు..
నదిలో నీరు ఉంటుంది కానీ, తుమ్మిళ్ల లిఫ్టు అధికారులకు ఫోన్ చేస్తే మోటార్‌కు నీరు అందడం లేదని అంటారు. దీంతో నీరు ఎప్పుడు అందిస్తారో.. ఎప్పుడు అందించరో అందులో పనిచేసే వారిపై ఆధారపడి ఉంది. అసలే పంటలు ఎండుతూ.. ఇబ్బందులు పడుతున్న రైతులకు, తుమ్మిళ్ల ఎత్తిపోతలలో పనిచేసే సిబ్బంది చెప్పే నిర్లక్ష్యపు సమాధానంతో మరింత ఆగ్రహం చెందాల్సి వస్తుంది. కనీసం నీటి సమాచారం ఇవ్వకపోతే వారు ఎందుకు పని చేస్తున్నట్లో తెలియదు.
– శంకర్‌నాయుడు, రైతు, తుమ్మిళ్ల
స్పష్టత ఇవ్వలేం..
ప్రస్తుతానికి నదిలో నీరు ఉంది.. కానీ, ఎప్పుడు ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గుతుందో చెప్పలేం. రైతులు ఇబ్బందులు పడకూడదనే ఇప్పటికే ఇండెంట్ మొత్తం వాడేశాం. ప్రస్తుతం నదిలో ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో తుమ్మిళ్ల మోటార్ ఆన్ చేశాం.
– రాందాసు, ఆర్డీఎస్ అధికారి
●


