జములమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు | - | Sakshi
Sakshi News home page

జములమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

గద్వాల న్యూటౌన్‌: నడిగడ్డ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతురావు అన్నారు. మంగళవారం కమిషనర్‌ దంపతులు ఆలయాన్ని సందర్శించగా.. ఈఓ పురేందర్‌కుమార్‌, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈఓ జములమ్మ చరిత్ర, ఆలయ విశిష్టత, భక్తుల విశ్వాసాలు, ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల గురించి ఈఓ ఆయన దృష్టికి తీసుకురాగా.. ప్రతిపాదనలు పంపించాలని, పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు స్థానచలనం

నారాయణపేట: రాష్ట్ర న్యాయశాఖలో జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలువురు జ్యుడీషియల్‌ అధికారులకు స్థానచలనం కల్పి స్తూ మంగళవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (విజిలెన్స్‌) ఉత్తర్వులు వెలువరించారు. నారాయణపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ ఫస్ట్‌ క్లాస్‌ అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కె.అవినాష్‌ను మక్తల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మక్తల్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులో ఆయన నియమితులయ్యారు. నారాయణపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టు బాధ్యతలను ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌కు అప్పగించి, కొత్త స్థానంలో బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. వనపర్తి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి బండారి శ్రీలత కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. కొల్లాపూర్‌ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.శరణ్య కల్వకుర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. మహబూబ్‌నగర్‌ మొబైల్‌ కోర్టు ప్రత్యేక జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ మహమ్మద్‌ మునావర్‌ హుస్సేన్‌ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. ఈ మేరకు బదిలీ అయిన జడ్జిలు ప్రస్తుత పోస్టుల నుంచి రిలీవ్‌ అయి, ఈ నెల 12లోగా కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని హైకోర్టు స్పష్టం చేసింది. అదనపు బాధ్యతలు నిర్వహించే అధికారులు, తమకు కేటాయించిన కోర్టులు వేరే ప్రాంతాల్లో ఉంటే బార్‌ అసోసియేషన్‌, కక్షిదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం వారానికి ఒకసారైనా కోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించింది.

పల్లీ @ రూ.9,170

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మంగళవారం 674 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.9,170, కనిష్టంగా రూ.4,561, సరాసరిగా రూ.7,669 ధరలు లభించాయి.

పీఏసీఎస్‌లకు ఇన్‌చార్జి చైర్మన్ల నియామకం

అలంపూర్‌: నియోజకవర్గంలోని 7 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సొసైటీలకు ప్రత్యామ్నాయ నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని జిల్లా సహకార అధికారి టైటస్‌పాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్‌ 32(7)(ఏ) ప్రకారం రాష్ట్ర వ్యవసాయ– సహకార శాఖ జారీ చేసిన జీఓ నంబర్లు 752, 753, 756, 757, 758, 759, 760 మేరకు నియామకాలు చేపట్టి ఉత్తర్వులు జారీ చేసినట్లు చేశామన్నారు. ఈ మేరకు అలంపూర్‌ పీఏసీఎస్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా పెద్ద అయ్యన్న, అయిజ కుర్వ సుజాత, కలుగోట్ల బి.శ్రీకాంత్‌, వడ్డేపల్లి ఈ.నాగరాజు, మానవపాడు బి.రామచంద్రారెడ్డి, క్యాతూర్‌ ఈ.నర్సన్‌గౌడ్‌, పుటాన్‌దొడ్డి బోయ మధునాయుడును నియమించినట్లు చెప్పారు. పీఏసీఎస్‌లు గ్రామీణ ప్రాంత రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరాతోపాటు ఇతర సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement