విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

మానవపాడు: ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని జల్లాపురంలో పర్యటించి.. పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించి.. చిన్నారుల ప్రగతి తదితర అంశాలను వివరించారు. పబ్లిక్‌ పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థులు అందరూ 550కుపైగా మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించేందుకు మెస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని, ఫీడ్‌ బ్యాక్‌ రికార్డులో చాలామంది విద్యార్థుల భోజనం యావరేజ్‌గా ఉందని రాయడంలో సంబంధిత సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోవడంపై అసహనం వెలిబుచ్చారు. గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, రోగాలు వ్యాపించకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌ను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉండటంతో సిబ్బంది అందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌ఓకు ఫోన్‌లో సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నందిని, డీఐఈఓ హృదయరాజ్‌, తహసీల్దార్‌ మాన్సూర్‌ అలీ సిద్ధిఖీ, ఎంపీడీఓ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement