బీమా కన్నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

బీమా కన్నీళ్లు!

Oct 23 2026 12:45 AM | Updated on Oct 23 2026 12:45 AM

రైతు ప్రాణం పోయినా.. అందని సాయం

పొలంలోనే అకస్మాత్తుగా

గుండెనొప్పితో..

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం కొత్తరాంనగర్‌ గ్రామానికి చెందిన గుర్రపు పాండుయాదవ్‌(39) ఆగస్టు 20న రాత్రి పొలంలో పత్తి పంటకు నీరు పెట్టడానికి వెళ్లగా అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో చనిపోయాడు.ఇతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. కూలిన పాత ఇళ్లు ఉండగా..ఇంటి ఆవరణలోనే రేకులు వేసుకొని కుటుంబం జీవనం సాగిస్తుంది. భార్య పద్మ, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వ్యవసాయం, ఇతర అవసరాల కోసం రూ.7లక్షల అప్పు ఉందని మృతుడి భార్య పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఏడు నెలలు గడుస్తున్నా..

మాది మాగనూరు. నా భర్త బచ్చి దేవేంద్రప్ప(32) ఏడు నెలల క్రితం పొలం దగ్గర విద్యుత్‌ మరమ్మతులు చే స్తుండగా..ఆకస్మికంగా కరెంట్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మరణించాడు. అయితే నా భర్త పేరు మీద ఒక ఎక రం పొలం ఉంది. నేను రైతు బీమా కోసం ఏడు నె లల క్రితం సంబంధిత వ్యవసాయ అధికారుల దగ్గ ర దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకు పరిహారం అందలేదు. దీంతో భర్తను కోల్పోయిన తాను ఆర్థి కంగా ఇబ్బందులు పడుతున్నాం.

– అంజలి, మాగనూర్‌, నారాయణపేట జిల్లా

చనిపోయిన రైతు వివరాలు

సేకరిస్తున్నాం

రైతు బీమా ప్రభుత్వం ప్రీ మియం చెల్లించకపోవడంతో ఆగిపోయింది. అందుకే బీమాకు అర్హులైన రైతులు చనిపోయినా పరిహారం రావడం లేదు. ఉన్నతాధికారులు చనిపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకోండని సమాచారం ఇవ్వడంతో చేస్తున్నాం. రెండు నెలల్లో జిల్లాలో 150మంది రైతు బీమా అర్హులై న రైతులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. వారికి పరిహారం ఎలా ఇస్తారో తమ సమాచారం లేదు. – యశ్వంత్‌రావు, డీఏఓ

నాగర్‌కర్నూల్‌: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న రైతు మరణిస్తే ఆ ఇంటి కష్టాలు రెట్టింపవుతాయి. పంటల కోసం చేసిన అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారతాయి. అలాంటి సమయంలో అండగా నిలిచే రైతుబీమా ఇప్పుడు నిలిచిపోవడంతో బాధిత కుటుంబాలకు భరోసా కరువైంది. రైతు మరణిస్తే అందే రూ.5 లక్షల పరిహారం కోసం వందలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పథకం నిలిచిపోయిన తర్వాత మరణించిన 501 మంది రైతుల కుటుంబాలకు రూ.25.05 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. మరోవైపు, బీమా అమల్లో ఉన్నప్పుడే రైతులను కోల్పోయిన కుటుంబాలకూ సాయం అందలేదు. నవంబర్‌ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా అమలవుతుందన్న నేపథ్యంలో పాత బాధితులకు పరిహారం ఎలా అందిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎనిమిదేళ్లుగా అండగా..

గత ప్రభుత్వంఎనిమిదేళ్ల క్రితం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 18–59 ఏళ్ల వయసున్న అర్హులైన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. ఏటా ఆగస్టు 14న ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించి పాలసీని పునరుద్ధరించేది. రైతు మరణిస్తే నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యేవి. సాధారణంగా వారం నుంచి పది రోజుల్లో పరిహారం అందడంతో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం లభించేది. అయితే ఈ ఏడాది ఆగస్టు 14న ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయింది. దీంతో ఆ తర్వాత మరణించిన అర్హులైన రైతుల కుటుంబాలకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది.

కొత్త పథకంపై స్పష్టత ఏదీ?

నవంబర్‌ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే అంతకుముందు మరణించిన రైతుల కుటుంబాల కు పరిహారం ఎలా అందిస్తారనే దానిపై స్పష్టత లేదు. కొత్త పథకం అమల్లోకి వచ్చినా మధ్యకాలంలో రైతులను కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన రైతులకు తిరిగి బీమా వర్తింపజేయడం సాధ్యం కానందున, ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

బీమా ఉన్నా అందని సాయం

బీమా అమల్లో ఉన్న సమయంలో రైతులను కోల్పోయిన కుటుంబాలకూ పరిహారం అందని పరిస్థితి ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 65 కేసులు పెండింగ్‌లో ఉండగా, 15 మంది రైతుల వివరాలు వివిధ కారణాలతో ప్రభుత్వానికి పంపలేదని సమాచారం. మిగిలిన 50 కుటుంబాలకు రూ.2.50 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పెండింగ్‌ కేసులు 200కుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బకాయిల విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. బాధిత కుటుంబాలు పరిహారం కోసం వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి.

ప్రభుత్వం స్పందించాలి

రైతుబీమా నిలిచిపోయిన తర్వాత మరణించిన అర్హులైన రైతుల కుటుంబాలను గుర్తించి పరిహారం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లనూ త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త పథకం అమలు తేదీ, పాత బాధితులకు పరిహారం, పెండింగ్‌ చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రైతు మరణంతో జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, కష్టకాలంలో అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

మహబూబ్‌నగర్‌

150

నాగర్‌కర్నూల్‌

జోగుళాంబ గద్వాల

108

76

నారాయణపేట

65

వనపర్తి

నిలిచిపోయిన రైతుబీమా పథకం

రూ.5 లక్షల సాయం కోసం బాధితుల ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో 501 కుటుంబాలకు అందని రూ.25.05 కోట్ల పరిహారం

కొత్త బీమాపై ఆశలు.. పాత బాధితుల్లో ఆందోళన

501 కుటుంబాలకు రూ.25.05 కోట్లు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీమా నిలిచిపోయిన తర్వాత మరణించిన అర్హులైన రైతులు 501 మంది ఉన్నట్లు సమాచారం. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.25.05 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఆందోళన మరింత పెరుగుతోంది. అధికారులను సంప్రదిస్తే పథకం నిలిచిపోయిందని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో రెండు నెలలో

రైతు బీమాకు అర్హులై చనిపోయిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement