తీరనున్న వెతలు.. | - | Sakshi
Sakshi News home page

తీరనున్న వెతలు..

Oct 23 2026 12:45 AM | Updated on Oct 23 2026 12:45 AM

గద్వాలన్యూటౌన్‌: స్వయం సహాయక మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందులు తొలగనున్నాయి. వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సంఘం భవన నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ. 10లక్షల చొప్పున కేటాయించారు. జిల్లావ్యాప్తంగా గ్రామ మహిళా సంఘం భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

సంఘాల నిర్వహణ ఇలా..

పది లేదా పదిహేను మంది మహిళలతో స్వయం సహాయక సంఘం ఏర్పాటు అవుతుంది. ఇలా ఏర్పడిన సంఘాల అధ్యక్షురాళ్లతో గ్రామ మహిళా సంఘాలు ఏర్పాటవుతాయి. పదిహేను నుంచి ఇరవై స్వయం సహాయక సంఘాలతో ఒక గ్రామ సంఘం ఉంటుంది. ఈ గ్రామ సంఘాలు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ అయి కార్యవర్గాలు ఉంటాయి. కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతినెలా రెండు సార్లు సమావేశం అవుతారు. ఈ సమావేశాల్లో ఆయా స్వయం సహాయక సంఘాలకు అందుతున్న రుణాలు, చెల్లింపులు, గ్రామైక్య సంఘం నిర్వహణ, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆర్థికపరమైన విషయాలు, వ్యాపారాలు, ప్రభుత్వ పథకాలు ఇలా అన్నింటిపై చర్చిస్తారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలను సభ్యులందరికీ తెలియజేస్తారు.

వీబీ–జీ రామ్‌జీ నిధులతో..

గ్రామ మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. ప్రతి పంచాయతీ పరిధిలో ఒక గ్రామై క్య భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. వీబీ–జీ రామ్‌జీ పథకం నిధులతో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా ఒక్కో భవనాన్ని రూ.10లక్షలతో నిర్మించే లా ప్రణాళిక రూపొందించారు. 20:20 చదరపు అడుగుల విస్తీర్ణంలో సమావేశం గది, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం ఉండేలా భవనం నిర్మిస్తున్నా రు. అయితే ముందుగా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులు గుర్తించిన తర్వాత పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు రూ పొందిస్తున్నారు. వీరు ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా వీబీ–జీ రామ్‌జీ పథకం నిధులతో నిర్మాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే ఆరు భవనాలు పూర్తికాగా.. ఇందులో మూడింటిని ఆయా గ్రామ మహిళా సంఘాలకు అప్పగించారు.

నెరవేరనున్న ఆకాంక్ష

జడ్చర్ల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రెవెన్యూ డివిజన్‌ కల త్వరలో సాకారం కానుంది.

–IIలో u

సంఘాలు మరింత బలోపేతం

జిల్లాలో గ్రామ మహిళా సంఘాల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ భవనాలు సంఘాల సమావేశాల నిర్వహణకు చక్కటి వేదికలు కానున్నాయి. ఇలాంటి వేదికలతో క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతాయి. అన్ని విషయాలు చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతమవుతాయి.

– ముషాహిదా బేగం, డీఆర్డీఓ

అసౌకర్యాల నడుమ సమావేశాలు..

చాలా గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ఆధారంగా ఒకటి లేదా రెండు.. మరికొన్ని చోట్ల మూడు, నాలుగు గ్రామైక్య సంఘాలు ఉంటాయి. గ్రామ మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండల స్థాయిలో మాత్రమే భవనాలు ఉన్నాయి. గ్రామస్థాయిలో లేకపోవడంతో ఇళ్లు లేదా చెట్ల కింద, రచ్చకట్టల వద్ద, ఆలయాల ఆవరణలో సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు. అక్కడ సరైన వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement