సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

Oct 23 2026 12:45 AM | Updated on Oct 23 2026 12:45 AM

● భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

● కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూ సేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభమై ఎన్నో ఏళ్లు అవుతున్నందున భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం చేయడం తగదన్నారు. అధికారులు చిత్తశుద్ధితో భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వేశాఖల అధికారులు సమన్వయంతో రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని సూచించారు. అవార్డు పూర్తయిన రైతులకు ఆలస్యం చేయకుండా సకాలంలో పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూరాల రిజర్వాయర్‌ చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులు యాసంగిలో వరిసాగు చేయకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. అనధికారంగా మోటార్లు పెట్టి నీరు పారించుకునే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూరాలలో నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యాసంగిలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరిసాగు చేయొద్దని ఆయన సూచించారు. బోర్లు, బావులు, ఇతర నీటి వనరులు ఉన్న చోట ఆరుతడి పంటలు వేసుకోవచ్చన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వే ఏడీ నూకరాజు, ఇరిగేషన్‌ ఈఈలు శ్రీనివాసులు, సంజీవ ప్రసాద్‌ ఉన్నారు.

రేపు అర్హత పరీక్షలు

జిల్లా వైద్యారోగ్య శాఖలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు, మల్టీ పర్పస్‌ వర్కర్‌ పోస్టులకు మధ్యాహ్నం 1గంట నుంచి 1:30 గంటల వరకు, స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు, ఏఎన్‌ఎం పోస్టులకు సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌పీహెచ్‌, సీహెచ్‌ఓ, ఎంఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌ అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు వాక్‌ ఇన్‌ ఇంట ర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థు లు షెడ్యూల్‌ ప్రకారం హాజరు కావాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే ప్రస్తుత సంస్థల్లో పని చేస్తు న్న అభ్యర్థులు తమ శాఖాధిపతి పొందిన నిరంభ్యంతర పత్రం తప్పనిసరిగా ధ్రువీకరించాలని సూచించారు. ఇదిలా ఉంటే, ఏఎంల్‌పీహెచ్‌, సీహెచ్‌ఓ, ఎంఓ, ఫిజీషియన్‌, ఫిజియోథెరిపిస్ట్‌, ఓబీజీ స్పెషలిస్ట్‌, పీఈ అర్హత కలిగిన ఆయుష్‌ వైద్యులు, డైటీషియన్‌, సైకో సోషల్‌ కౌన్సెలర్‌, యోగా ప్రొఫెషనలర్‌, సీనియర్‌ ట్యూ బర్‌క్యులోసిస్‌, ల్యాబోరేటరి సూపర్‌వైజర్‌ తదితర పో స్టులకు సంబంధించిన మెరిట్‌ జాబితాను అధి కారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement