పత్తి రైతు కుదేలు! | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు కుదేలు!

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

–8లో u

అయిజ: పత్తి రైతుల ఆశలపై తుఫాన్‌ నీళ్లు చల్లింది. పంట చేతికొచ్చిన సమయంలో కురిసిన వర్షాలతో తెల్లబంగారం నల్లబడటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. తుఫాన్‌కు ముందు క్వింటాకు రూ. 10,200 నుంచి రూ. 10,500 వరకు పలికిన పత్తి ధర.. ప్రస్తుతం రూ. 8,200 నుంచి రూ. 9,200 వరకు పడిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలు కొంతమంది రైతులకు మేలు చేకూర్చగా.. పత్తిని సాగుచేసిన రైతులకు మాత్రం శాపంగా మారాయి.

కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపులు..

మార్కెట్లలో నాణ్యతలేని పత్తిని కొనేందుకు నిరాకరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులకు మరింత నష్టం కలిగే అవకాశముందని వాపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, రంగుమారిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని.. లేనిచో తుఫాన్‌ విపత్తుగా పరిగణించి, రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

నల్లబడిన పత్తిని పరిశీలిస్తున్న రైతులు

తుఫాన్‌తో నల్లబడిన తెల్లబంగారం

మార్కెట్‌లో గణనీయంగా

పడిపోయిన ధర

కొనుగోలుకు నోచుకోని

రంగుమారిన పత్తి

చేసేది లేక తక్కువ ధరకు

దళారులకు విక్రయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement