బ్రాహ్మణుల ఐక్యతకు ‘బాస్‌’ కీలక పాత్ర | - | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణుల ఐక్యతకు ‘బాస్‌’ కీలక పాత్ర

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

అలంపూర్‌ రూరల్‌: బ్రాహ్మణుల ఐక్యత, సామాజిక చైతన్యం, అన్ని రంగాల్లో అభివృద్ధికి బ్రాహ్మిణ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ (బాస్‌) కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు అన్నారు. బాస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం అలంపూర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వివిధ బ్రాహ్మణ సంఘాలను బాస్‌ ఆధ్వర్యంలో ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఐక్యతకు బాటలు వేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణుల మధ్య సమన్వయం, పరస్పర సహకారం పెంపొందించడంతో పాటు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. అక్టోబర్‌ 25న మహబూబ్‌నగర్‌లో సుమారు 2,500 మంది బ్రాహ్మణులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో గొండ్యాల రాఘవేంద్ర శర్మ, ప్రమోద్‌ కొటారి, బాస్‌ కోఆర్డినేటర్‌ వెల్దండ ప్రదీప్‌, భీమ్‌సేనరావు, భక్షి శ్రీధర్‌, జ్యోషి గోపాలకృష్ణ, వర్నె చంద్రకాంత్‌, బోరవెల్లి ప్రవీణ్‌, రాజు, సాయికిరణ్‌, ప్రహ్లాదాచారి, ఆనంద్‌ శర్మ ఉన్నారు.

మార్కెట్‌ పరిసరాల్లో వ్యర్థాలు వేయొద్దు

అలంపూర్‌: మున్సిపాలిటీలోని చేపల మార్కెట్‌ పరిసరాల్లో వ్యర్థాలు వేయొద్దని పుర కమిషనర్‌ రాజేశ్‌ వ్యాపారులకు సూచించారు. ఆదివారం చేపల మార్కెట్‌ను ఆయన పరిశీలించి.. వ్యాపారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్‌ను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చేపలను రవాణాచేసే క్రమంలో నీటిని బయటకు వదులుతుండటంతో పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. చేపల రవాణా, చేపల కోసం వినియోగించే నీరు బయటికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. ఆయన వెంట మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

నేడు మంత్రుల రాక

వనపర్తి: జిల్లాలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఎంపీ మల్లు రవి పర్యటించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని నల్లచెరువులో చేప పిల్లలను వదిలి కలెక్టరేట్‌ నుంచే వర్చువల్‌గా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, శ్రీరంగాపురం తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, బీసీ గురుకులం జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అనంతరం హౌసింగ్‌, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement