పెంచితే బాగుంటుంది.. | - | Sakshi
Sakshi News home page

పెంచితే బాగుంటుంది..

Aug 24 2026 12:37 AM | Updated on Aug 24 2026 12:37 AM

ప్రస్తుతం వర్షాలు సరిగా కురువడం లేదు. నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ ద్వారా నీరు వస్తేనే పంటలు సాగవుతాయి. ఈ రిజర్వాయర్‌ 15 టీఎంసీలకు పెరిగితే రెండు పంటలు సాగు చేసుకోగలం. వచ్చే ఏడాదికై నా గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. – మల్దకల్‌, ఎక్లాస్‌పురం

పరిహారం చెల్లించాలి

ప్రాజెక్టు సామర్థ్యం పెంపు బాగుంది కానీ, ముంపు ప్రాంతంలో పంట పొలాలు, ఇళ్లు మునిగిపోతాయి. కాబట్టి ప్రతి ఎకరాకు సరైన పరిహారం లేదా ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి. గత ప్రాజ్టెల్లో జాప్యాలు జరిగాయి. ఇప్పుడు పారదర్శకంగా వేగంగా, చేస్తేనే రైతులు నమ్మకం పెంచుకుంటారు.

– యువతేజేశ్వర్‌రెడ్డి, గుడ్డెందొడ్డి

సర్వే పూర్తవుతోంది..

గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంచే సర్వే పనులు పూర్తి కాకొచ్చాయి. సుమారు 600 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అలాగే జల విద్యుత్‌ చేసేందుకు కూడా ప్రణాళిక చేశారు. ఈ పనులు పూర్తయితే ఒకసారి రిజర్వాయర్‌ నిండితే రెండేళ్ల వరకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. – సూర్య, డీఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement