పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

Aug 24 2026 12:37 AM | Updated on Aug 24 2026 12:37 AM

మల్దకల్‌/ గట్టు: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్‌ మండలంలోని తాటికుంట, గట్టు మండలంలోని ఆలూరు గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు కాగా.. వీటిలో 2 వేల ఇళ్ల పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే వాటి పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులైన పేదలకు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అపోహలు నమ్మవద్దని, ఇళ్లు నిర్మించుకున్న అందరికీ బిల్లులు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విజయ్‌, రమేష్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్‌, నాయకులు తిమ్మప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement